Friday, January 24, 2025
spot_img

విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుంది

Must Read
  • ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 7 వేల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్ లను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ.హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఝాన్సీ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో పేద,మధ్యతరగతి విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల కాకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నారని,గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా విద్యార్థి వ్యతిరేక విధానాలతో పోతుందని మండిపడ్డారు.ప్రభుత్వాలు మారిన విద్యార్థుల బతుకులు బాగుపడడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్,స్కాలర్ షిప్లు విడుదల చేయలేని పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని,మంత్రులను విద్యార్ధి పరిషత్ కార్యకర్తలు ఎక్కడిక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.అనంతరం వరంగల్ విభాగ్ కన్వీనర్ నిఖిల్ మాట్లాడుతూ నీళ్లు,నిధులు,నియామకాల కోసం తెలంగాణ సాధించుకుంటే గత ప్రభుత్వం,ప్రస్తుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్ధి వ్యతిరేక విధానాలతో ముందుకు పోతుందని మండిపడ్డారు.రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరుణ్,జోనల్ ఇన్చార్జులు శ్రవణ్ కుమార్,హరిచరణ్,కార్యకర్తలు సర్దార్,శ్రవణ్, రోహిత్, రేవంత్, శ్రీశాంత్,అక్షిత్, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News

రైతు దేవుడు క‌దా.. రాజు ఎలా అవుతాడు..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా..! మరి ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానీ పరబ్రహ్మాన్నే పండిస్తున్న రైతు దేవదేవుడు అవుతాడు కానీ, రాజు ఎలా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS