Monday, November 4, 2024
spot_img

జూన్ 26న రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ విజయవంతం చేయాలి

Must Read

( ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కమల్ సురేష్ )

  • ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
  • అక్రమంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి

ఏబీవీపీ ఇచ్చిన పిలుపు మేరకు జూన్ 26న ( బుధవారం ) తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల బంద్ ని విజయవంతం చేయాలని కోరారు ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కమల్ సురేష్ .తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని,ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల్లో అక్రమ ఫీజులను అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని రావాలనే డిమాండ్స్ తో జూన్ 26న ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ కి పిలుపునిచ్చింది.ఈ సంధర్బంగా కమల్ సురేష్ మాట్లాడుతూ అక్రమంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్,ప్రైవేట్,ఇంటర్నేషనల్ పాఠశాలల పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.నిబంధనాలకు విరుద్ధంగా బుక్స్,యూనిఫామ్స్ అమ్ముతున్న పాఠశాలల పై ప్రభుత్వం,విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వ నిబంధనలను పాటించని పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.మెగా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న 24వేల పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.విద్య హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

Latest News

ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తారా

ప్రజాపాలన అంటే ప్రతిపక్షం గొంతు నొక్కడమా? శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులపై కేసులు దారుణం ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS